కావలి ఎమ్మెల్యే శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి కార్యాలయంలో కావలి నియోజకవర్గం తేదీ20.07.18 నా లోని బూత్ కన్వీనర్లకు శిక్షణ శిబిరం నిర్వహించబడినది

 తేదీ 20.07.18 నా కావలి ఎమ్మెల్యే శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి కార్యాలయంలో కావలి నియోజకవర్గం లోని బూత్ కన్వీనర్లకు శిక్షణ శిబిరం నిర్వహించబడినది. 

ఉదయం కావలి మండలం వారికి మధ్యాహ్నం నుంచి కావలి పట్టణం వారికి శిక్షణా తరగతులు జరిగినవి. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎన్నికలు సక్రమంగా నిర్వహించుటకు బూత్ కన్వీనర్లు పాత్ర చాలా ముఖ్యమైనదని, వారి సేవ ద్వారానే పార్టీ అధికారంలోకి వచ్చునని. అధికారంలోకి రాగానే వారి సేవకులుగా ప్రాముఖ్యత వారికి కల్పించబడును అని ఎమ్మెల్యే గారు శిక్షణా తరగతులకు హాజరైన కన్వీనర్లను ఉద్దేశించి అన్నారు. వారికి సంబంధించిన పోలింగ్ బూత్ లోని ఓటర్లను సరి చూసుకోవాలని తప్పులేమైనా ఉంటే సవరించుకునేందుకు సన్నద్ధం కావాలని వారికి సూచించారు.పోలింగ్ బూత్ లోని అందరు సభ్యులు ఎంత పటిష్టంగా ఉంటే పార్టీ అంత పటిష్టంగా ఉంటుందని కాబట్టి నాయకులు కార్యకర్తలు సదరు పోలింగ్ బూత్ సభ్యులకు కన్వీనర్లకు ఎల్లవేళలా వారి సహాయ సహకారాలు అందించాలని సమావేశమునకు హాజరైన వారికి తెలియజేశారు. నియోజకవర్గ పోలింగ్ బూత్ మ్యానేజర్ గా శ్రీ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారిని నియమించానని అలాగే ప్రతి మండలానికి ఒక అబ్జర్వర్ కూడా త్వరలో ఏర్పాటు చేస్తానని. ఎన్నికల సమయం ఆసన్నమైనందున ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంతరాలు ఏర్పడకుండా జాగ్రత్త గా ఉండాలని ఎమ్మెల్యే గారు వారికి సూచించారు. పార్టీలో కొందరికి కొన్ని బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ పదవులను ఎమ్మెల్యే గారు అనౌన్స్ చేశారు.


google+

linkedin