కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసాన్ని సోమవారం ఉదయం ముట్టడించిన పోలీసు అధికారులు

కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసాన్ని ప్రత్యేక బలగాలతో సోమవారం ఉదయం 5.30 గంటలకు ముట్టడించిన పోలీసు అధికారులు

  • కావలి నియోజకవర్గంలోని అల్లూరు మండలం ఇస్కపల్లి పంచాయతీలో పర్యటించడానికి సిద్ధం అవుతున్న ఎమ్మెల్యే ను ఆయన ఇంట్లో పోలీసు అధికారులు కలిసి పర్యటించడానికి అంగీకరించమని చెప్పారు.
  • మత్స్యకారులు జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల నమ్మకం తో వైఎస్సార్ సీపీ లో చేరుతుండటంతో.... టీడీపీ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులు పై మంత్రులతో ఫోన్ లు చేయించి... పోలీసులతో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ని గృహనిర్భందం చేయించారు
  • ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాస ప్రాంగణంలో పెద్ద ఎత్తున ప్రత్యేక పోలీసులు బలగాలు మొహరించడం, పోలీసు అధికారులు ఎమ్మెల్యే ఇంటి వద్దనే మకాం వేశారు.
  • అల్లూరు, దగదర్తి, బోగోలు, కావలి రూరల్ మండలాల్లో బీద మస్తాన్ రావు, బీద రవిచంద్ర ల వేలాది ఎకరాల భూములను ఆక్రమించుకొని ఉన్న అన్నింటి పై సీబీఐ విచారణ జరపాలని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు
  • టీడీపీ నాయకులు పోలీసులు ద్వారా నన్ను ఇబ్బంది పెట్టినా... నేను మాత్రం మత్స్యకారుల గ్రామాలకు వెళ్లి తీరుతాను - ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
  • టీడీపీ నాయకులైన బీద మస్తాన్ రావు, బీద రవిచంద్ర ల ప్రైవేటు ఎస్టేట్ కాదు కావలి నియోజకవర్గం. 5 లక్షల జనాభా ఉన్న ప్రజాస్వామ్య దేశంలో ఉన్న కావలి నియోజకవర్గం ఇది. - ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
  • అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలను లొంగదీసుకొని పబ్బం గడుపుకోవాలని అనే బీద మస్తాన్ రావు, బీద రవిచంద్ర ఆటలను ఆత్మాభిమానం కలిగిన కావలి నియోజకవర్గ ప్రజలు సాగనివ్వరు. - ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
  • ఇస్కపల్లి గ్రామ పంచాయతీ లో చంద్రబాబు నగర్ కు చెందిన మత్స్యకారులు వైఎస్సార్ సీపీ లో చేరి.... పార్టీ కండువాలు కప్పుకొని..... నన్ను గ్రామానికి రమ్మని ఆహ్వానిస్తుంటే.... ఆ గ్రామంలో పర్యటించేందుకు వెళ్తుంటే.... టీడీపీ నాయకులు బీద మస్తాన్ రావు, బీద రవిచంద్ర లు పోలీసులను పంపి నన్ను గృహ నిర్బంధం చేయించడం... ప్రజాస్వామ్యమా... నియంతల పరిపాలనా.... - ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి



google+

linkedin