కావలి సబ్ కలెక్టర్ శ్రీధర్ గారిని వారి కార్యాలయంలో ఎమ్మెల్యే గారు

కావలి ఎమ్మెల్యే శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కావలి సబ్ కలెక్టర్ శ్రీధర్ గారిని వారి కార్యాలయంలో కలిసి దగదర్తి మండలం నారాయణపురం గ్రామంలో నిబంధనలకు వ్యతిరేకంగా రెవిన్యూ రికార్డులు తారుమారు చేశారని అంతేకాకుండా తాసిల్దారు అధికార పార్టీ ఒత్తిడికి తలొగ్గి ఏకపక్షంగా కేసులు నమోదు చేయడానికి కూడా వెనుకాడటం లేదని సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వచ్చారు. జన్మభూమి కార్యక్రమం అయిపోయిన వెంటనే తాను వ్యక్తిగతంగా సర్వే చూపించి ఎవరికీ ఎటువంటి అన్యాయం జరగకుండా చూస్తామని సబ్ కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. అలాగే kalugolamma గుడి వద్ద ఉన్న ఫ్లైఓవర్ వంతెన నిర్మాణానికి భూమి నష్టపోయిన వారికి మరియు షాపులు తీసేయ బడిన వారికి నష్టపరిహారం గురించి లబ్ధిదారుల సమక్షంలో వారి బాధలను సబ్ కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారు తెలియజేశారు. వాస్తవ పరిస్థితిని పై అధికారులకు పంపుతాను అని సబ్ కలెక్టర్ గారు తెలిపారు





google+

linkedin